చెన్నై, జూన్ 3: సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లో రాబోతున్నాయి. దీంతో ఎన్నికల బరిలో నిలబడ్డ అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. తమిళనాడులోని విరుధ్‌నగర్ ఎంపీ స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన తన భార్య రాధిక గెలుపు కోసం తమిళనటుడు, రాజకీయ నాయకుడు శరత్‌కుమార్ సోమవారం ఇక్కడి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మోదీ మళ్లీ అధికారంలోకి రావాలని, రాధిక గెలవాలని విరుధ్నగర్లోని అమ్మవారి దేవాలయంలో పొర్లుదండాలు చేసి.. మొక్కుకున్నారు.