న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం తమ పార్టీ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోదని అన్నారు. ఆదివారం మీడియా సమావేశంలో అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడారు. ఢిల్లీలో తాము ఏ పార్టీతో ఎలాంటి పొత్తు పెట్టుకోబోమని తెలిపారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని స్పష్టం చేశారు.
కాగా, తనపై స్పిరిట్‌తో దాడి చేయడంపై అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. దేశ రాజధానిలో శాంతిభద్రతల పరిస్థితిపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై మండిపడ్డారు. ‘నేను (లా అండ్ ఆర్డర్) సమస్యను లేవనెత్తిన తర్వాత అమిత్ షా ఏదైనా చర్య తీసుకుంటారని ఊహించా. కానీ, దానికి బదులుగా పాదయాత్రలో నాపై దాడి జరిగింది. నాపై లిక్విడ్ విసిరారు. నాకు హాని జరుగలేదు. అయితే అది హాని కలిగించేదే’ అని అన్నారు.
మరోవైపు ప్రజా భద్రత, నేర సమస్యలను మాత్రమే తాము లేవనెత్తామని కేజ్రీవాల్ తెలిపారు. ‘మీకు వీలైతే, గ్యాంగ్స్టర్లను అరెస్టు చేయండి. దానికి బదులుగా మమ్మల్ని ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారు?’ అని ప్రశ్నించారు.
#WATCH | AAP national convener Arvind Kejriwal says, “There will be no alliance in Delhi (for assembly elections).” pic.twitter.com/KlPKL9sWrY
— ANI (@ANI) December 1, 2024