AAP MLA | రోడ్డు ప్రమాదంలో ఆప్ ఎమ్మెల్యేకు తీవ్ర గాయాలు
AAP MLA | పంజాబ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆప్ ఎమ్మెల్యే కరంబీర్ సింగ్తో పాటు మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆప్ ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు ఘోగ్రా గ్రామానికి సమీపంలో ఓ కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టింది.
AAP MLA | చండీఘర్ : పంజాబ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆప్ ఎమ్మెల్యే కరంబీర్ సింగ్తో పాటు మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆప్ ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు ఘోగ్రా గ్రామానికి సమీపంలో ఓ కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో ఎమ్మెల్యేకు తీవ్ర గాయాలయ్యాయి. ఎమ్మెల్యే కరంబీర్ హోషియాపూర్ జిల్లాలోని దసుయా నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఎమ్మెల్యే తల్వారా పట్టణానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యేతో పాటు ఆయన వ్యక్తిగత సహాయకుడు శుభం, గన్మెన్ అమృత్ దీప్ సింగ్, డ్రైవర్ జస్సా సింగ్, మరో వ్యక్తి దల్జీత్ సింగ్ గాయపడ్డారు. క్షతగాత్రులను దసుయాలోని సివిల్ ఆస్పత్రికి తరలించారు. ఎమ్మెల్యేతో పాటు మిగతా వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

