Aadhaar Number | భూములకు ఆధార్ నంబర్.. పట్టణ భూ రికార్డుల డిజిటలైజేషన్
గ్రామీణ ప్రాంతాల్లోని భూములకు విశిష్ఠ గుర్తింపు నంబర్ లేదా ‘భూ-ఆధార్' నంబర్ కేటాయిస్తామని, పట్టణ ప్రాంతాల్లోని భూమి రికార్డులను డిజిటలైజేషన్ చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో పలు భూ సంస్కరణలను ప్రతిపాదించారు.
Aadhaar Number | న్యూఢిల్లీ, జూలై 23: గ్రామీణ ప్రాంతాల్లోని భూములకు విశిష్ఠ గుర్తింపు నంబర్ లేదా ‘భూ-ఆధార్’ నంబర్ కేటాయిస్తామని, పట్టణ ప్రాంతాల్లోని భూమి రికార్డులను డిజిటలైజేషన్ చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో పలు భూ సంస్కరణలను ప్రతిపాదించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఈ భూ సంస్కరణలను అమలు చేసేందుకు రాష్ర్టాలతో కలిసి పనిచేస్తామని చెప్పారు. వచ్చే మూడేండ్లలో ఈ సంస్కరణలను పూర్తి చేయడంలో రాష్ర్టాలను ప్రోత్సహించడానికి ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపారు. ‘గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో చేపట్టబోయే సంస్కరణల్లో 1. భూ యాజమాన్యం, ప్రణాళిక, నిర్వహణ, (2) పట్టణ ప్రణాళిక, వినియోగం, భవన నిర్మాణాలకు నిబంధనలు ఉంటాయి. వీటి అమలుకు రాష్ర్టాలకు ఆర్థిక సహాయం అందజేస్తాం’ అని మంత్రి పేర్కొన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లోని భూములకు ‘యూనిక్ ల్యాండ్ పార్శిల్ ఐడెంటిఫికేషన్ నంబర్ (యూఎల్పీఐఎన్) లేదా భూ-ఆధార్ నంబర్ కేటాయిస్తామని తెలిపారు. పన్ను విధింపునకు అర్హమైన (కెడస్ట్రల్) భూముల డిజిటలైజేషన్, ప్రస్తుత యాజమాన్యం ప్రకారం మ్యాప్ సబ్ డివిజన్ల సర్వే, ల్యాండ్ రిజిస్ట్రీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. సంస్కరణల్లో భాగంగా రుణ వసతి, వ్యవసాయ సంబంధిత సేవలు కూడా ఉంటాయని పేర్కొన్నారు. ఇక పట్టణ ప్రాంతాల్లో జీఐఎస్ మ్యాపింగ్ ద్వారా ల్యాండ్ రికార్డులను డిజిటలైజ్ చేస్తామని తెలిపారు. ఆస్తుల వివరాల నిర్వహణ, ఉన్నతీకరణ, పన్ను యాజమాన్యానికి సంబంధించి ఐటీ ఆధారిత వ్యవస్థను ఏర్పాటుచేస్తామని పేర్కొన్నారు. ఈ చర్యల ద్వారా పట్టణ స్థానిక సంస్థల ఆర్థిక పురోభివృద్ధికి దోహదం చేస్తామని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

