కోల్కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణ చేశారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చెందిన ఆధార్ కార్డుల(Aadhaar Cards)ను కేంద్రం డీయాక్టివేట్ చేస్తున్నట్లు ఆమె తెలిపారు. లోక్సభ ఎన్నికలకు ముందు ఎన్ఆర్సీని తీసుకువచ్చే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీల కార్డులను డీయాక్టివేట్ చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర సచివాలయంలో ఆమె రిపోర్టర్లతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆధార్ కార్డుల డీయాక్టివేషన్ గురించి ప్రధాని మోదీకి లేఖ రాయనున్నట్లు ఆమె తెలిపారు. లోక్సభ ఎన్నికలకు ముందు ఎందుకు భారీ సంఖ్యలో ఆధార్ కార్డులను డీయాక్టివేట్ చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. మతువా వర్గానికి చెందిన ప్రజల ఆధార్ కార్డులను ఎక్కువగా డీయాక్టివేట్ చేసినట్లు ఆమె ఆరోపించారు.