న్యూఢిల్లీ : నిదానమే ప్రధానమని, మెల్లిగా..నిలకడగా సాగితే రేస్ గెలుస్తామని పిల్లలకు పెద్దలు నూరిపోస్తుంటారు. బాల్యంలో ఈ సామెత చాలా మంది పిల్లలకు పెద్దలు చెబుతుంటారు. ఈ సామెతను నిజం చేస్తూ ఓ బాలుడు లెమన్ రేస్‌లో విజేతగా నిలిచాడు. ఈ పోటీకి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Slow and steady wins the race. —Aesop pic.twitter.com/6yaixiJvER
— Vala Afshar (@ValaAfshar) November 9, 2022
వాలా అఫ్సర్ ట్విట్టర్లో షేర్ చేసిన ఈ వీడియో ఇప్పటివరకూ కోటి వ్యూస్ దక్కించుకుంది. ఈ వీడియోలో లెమన్ రేస్‌లో పాల్గొన్న బాలురు కనిపిస్తారు. ఇందులో కొద్దిమంది రేస్‌లో గెలవాలని వేగంగా నడుస్తుండగా వారి స్ఫూన్ల నుంచి నిమ్మకాయలు మధ్యలోనే పడిపోతాయి. అయితే తెల్ల షర్ట్ ధరించిన ఓ బాబు మెల్లిగా, ఒకే వేగంతో వెళుతూ ఫినిషింగ్ పాయింట్‌కు చేరుకోవడం కనిపిస్తుంది.
ఈ బాలుడు ఇతరుల మాదిరిగా వేగంగా నడవలేదు. లక్ష్యంపైనే గురిపెట్టిన బాలుడు మెల్లిగా, నిలకడగా వెళుతూ టార్గెట్ చేరుకున్నాడు. చిన్నారి ప్రతిభను పలువురు నెటిజన్లు కొనియాడారు. బాలుడి తీరును ఓ యూజర్ వారెన్ బఫెట్ పోర్ట్‌పోలియోతో పోల్చగా, టెంపో, వేగం కూడా కీలకమని మరో యూజర్ రాసుకొచ్చారు.