ముంబై, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాల్లో డబ్బు సంచుల వీడియో ఒకటి సంచలనం సృష్టించింది. నాగ్‌పూర్‌లో జరిగిన సమావేశాల రెండవ రోజున ఉద్ధవ్ శివసేన నాయకుడు అంబదాస్ దాన్వే అధికార పార్టీని లక్ష్యంగా చేసుకుని ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఒక ఎమ్మెల్యే నోట్ల కట్టను మోసుకెళ్తున్నట్లు అందులో కనిపించడంతో ఈ వీడియో రాజకీయంగా సంచలనం సృష్టించింది.
ముఖ్యమంత్రి ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం షిండేలను ఉద్దేశించి దానే మాట్లాడుతూ.. ఈ ఎమ్మెల్యే ఎవరు, డబ్బు సంచులతో ఏమి చేస్తున్నారో ప్రజలకు చెప్పండి? దీనిపై దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు.