Vidhya Philippon | ముంబై, డిసెంబర్ 21: తనకు జన్మనిచ్చిన తల్లి కోసం స్విట్జర్లాండ్ యువతి విద్యా ఫిలిప్పోన్ (26) పదేండ్ల నుంచి ముంబైలో అన్వేషిస్తున్నారు. విద్యను ఆమె తల్లి మిషనరీస్ ఆఫ్ చారిటీలో వదిలిపెట్టారు. అనంతరం ఆమెను స్విట్జర్లాండ్ జంట 1997లో దత్తత తీసుకున్నది.
స్విట్జర్లాండ్లో పెరిగి, పెద్దయిన విద్య ఫిలిప్పోన్కు తన తల్లిని కలుసుకోవాలనే ఆత్రుత తీవ్రంగా ఉన్నది. అయితే ఆమె వద్ద ఉన్న సమాచారం కేవలం ఆమె ఇంటి పేరు, అప్పట్లో వారు నివసించిన ప్రాంతం చిరునామా మాత్రమే. ఆమె తన భర్తతో సహా ముంబైకి వచ్చి, మిషనరీస్ ఆఫ్ చారిటీ, రావల్ పడా, దహీసార్ ప్రాంతాల్లో తన తల్లి కోసం అన్వేషిస్తున్నారు. అడాప్టీ రైట్స్ కౌన్సిల్ డైరెక్టర్, న్యాయవాది అంజలీ పవార్ కూడా ఆమెకు సహాయపడుతున్నారు.