న్యూఢిల్లీ: ప్రాణాంతక క్యాన్సర్‌ను వేగంగా గుర్తించే సర్జికల్ ఇంటెలిజెంట్ నైఫ్‌ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీనిని ర్యాపిడ్ ఎవాపొరేటీవ్ అయోనైజేషన్ మాస్ స్పెక్ట్రోమెట్రీ అని పిలుస్తారు. ఈ సర్జికల్ నైఫ్‌ను ఉపయోగించి కొన్ని ప్రామాణిక ఎలక్ట్రోసర్జికల్ పద్ధతుల ద్వారా క్యాన్సర్‌ను గుర్తించవచ్చని, ప్రత్యేకించి ఎండోమెట్రియల్ క్యాన్సర్‌ను గుర్తించడంలో ఇది సమర్థంగా పని చేస్తుందని లండన్‌లోని ఇంపీరియల్ కాలేజ్‌కి చెందిన వైద్య నిపుణులు వెల్లడించారు. 150 మంది శాంపిళ్లను ఈ సర్జికల్ ఇంటెలిజెంట్ నైఫ్ (ఐనైఫ్) ద్వారా పరీక్షించగా 89 శాతం కచ్చితత్వంతో ఫలితాలు వచ్చాయని తెలిపారు. క్యాన్సర్‌ను వేగంగా గుర్తించి, త్వరగా చికిత్స ప్రారంభించేందుకు ఈ ఐనైఫ్ ఉపయోగపడుతుందని వెల్లడించారు.