ఫ్రాన్స్ అల్లర్లు, ఢిల్లీ నిరసనల వెనుక ఒకే గ్లోబల్ నెట్వర్క్!
ఫ్రాన్స్‌లో చెలరేగిన అశాంతికి, భారత్, ఇతర దేశాలలో యువత నేతృత్వంలో జరిగిన నిరసన ప్రదర్శనలకు మధ్య సంబంధాలు ఉన్నట్టు ఫాక్స్ న్యూస్ డిజిటల్ జరిపిన దర్యాప్తులో వెల్లడైన నేపథ్యంలో ఫ్రాన్స్ నిరసనలను సమన్వయం చేయడం, నిర్వహించడం, లేదా తీవ్రతరం చేయడంలో కనీసం 50 సంస్థల పాత్రను గుర్తించినట్టు తెలుస్తున్నది. ఈనెల 9న ప్రచురించిన ఫాక్స్ న్యూస్ డిజిటల్ దర్యాప్తు నివేదిక ప్రకారం ఫ్రాన్స్ విద్యార్థి నిరసన ఉద్యమంతో సంబంధం ఉన్న 50 సంస్థలను గుర్తించారు.
- విద్యార్థి ప్రదర్శనల్లో ఇతర శక్తుల హస్తం
- సరిహద్దుల ఆవల విస్తృత ప్రచారం
- ఫాక్స్ న్యూస్ డిజిటల్ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ, అక్టోబర్ 22: ఫ్రాన్స్‌లో చెలరేగిన అశాంతికి, భారత్, ఇతర దేశాలలో యువత నేతృత్వంలో జరిగిన నిరసన ప్రదర్శనలకు మధ్య సంబంధాలు ఉన్నట్టు ఫాక్స్ న్యూస్ డిజిటల్ జరిపిన దర్యాప్తులో వెల్లడైన నేపథ్యంలో ఫ్రాన్స్ నిరసనలను సమన్వయం చేయడం, నిర్వహించడం, లేదా తీవ్రతరం చేయడంలో కనీసం 50 సంస్థల పాత్రను గుర్తించినట్టు తెలుస్తున్నది. ఈనెల 9న ప్రచురించిన ఫాక్స్ న్యూస్ డిజిటల్ దర్యాప్తు నివేదిక ప్రకారం ఫ్రాన్స్ విద్యార్థి నిరసన ఉద్యమంతో సంబంధం ఉన్న 50 సంస్థలను గుర్తించారు. వీటిలో కమ్యూనిస్టు, సోషలిస్టు, వామపక్ష సమూహాలు ఉన్నాయి. పాఠశాలల దుస్థితిపై జరుగుతున్న నిరసన ప్రదర్శనలను తమ విస్తృత రాజకీయ, సైద్ధాంతిక అజెండాలను ముందుకు తీసుకెళ్లడానికి ఇవి వాడుకుంటున్నాయని నివేదిక ఆరోపించినట్టు ఏఎన్ఐ వార్తాసంస్థ పేర్కొంది. ఫాక్స్ న్యూస్ జర్నలిస్ట్ ఆస్రా క్యూ నోమానీ ప్రచురించిన ఈ పరిశోధన దీనిని ఒక అంతర్జాతీయ నిరసన కార్యాచరణ వ్యవస్థగా అభివర్ణించింది.
ఈ బృందాలు సరిహద్దులు దాటి నిరసన సందేశాలను వ్యాప్తి చేయడానికి, విభిన్న స్థానిక సమస్యలతో కూడిన ఉద్యమాలను అనుసంధానించడానికి సహాయపడుతున్నాయని పరిశోధన నివేదిక పేర్కొంది. దీని ప్రకారం పరిశోధనలో గుర్తించిన 50 సంస్థల్లో కేవలం 15 మాత్రమే విద్యార్థి లేదా యువజన సంఘాలు కాగా, మిగిలిన 35 సంస్థల్లో కార్మిక సంఘాలు, కమ్యూనిస్టు, సోషలిస్టు సంస్థలు, రాజకీయ పార్టీలు, పౌర హక్కుల సంఘాలు, ఇతర సామాజిక సంస్థలు ఉన్నాయి. ఈ నెట్వర్క్ ఫ్రాన్స్‌కే పరిమితం కాకుండా అమెరికా, బ్రిటన్, గ్రీస్, బ్రెజిల్, భారత్ వంటి దేశాలకు కూడా విస్తరించిందని ఫాక్స్ న్యూస్ డిజిటల్ నివేదిక తెలిపింది. ఇక్కడ సంస్థలు మద్దతుదారులను సమీకరిస్తూ, సమ్మెలకు పిలుపునిస్తూ, అంతర్జాతీయ మీడియా సంస్థల ద్వారా ప్రదర్శనలను విస్తృతం చేస్తున్నాయని పేర్కొంది.
సోషల్ మీడియాలో ప్రచారం
ఫ్రాన్స్‌కు చెందిన విద్యార్థులు, పరిశోధకులు, నిపుణుల సంస్థ ఇండియన్ అలయన్స్ పారిస్ సోషల్ మీడియాలో ఫ్రెంచ్ ప్రదర్శనలను ప్రోత్సహించిందని, భారత్‌లోని విద్యార్థుల నిరసనలతో వాటిని పోల్చిందని ఆ నివేదిక తెలిపింది. ఇండియన్ అలయన్స్ పారిస్ రెండు దేశాల్లోని యువ నిరసనకారులకు మద్దతు తెలుపుతూ జెన్‌జీకి: ఫ్రాన్స్‌లో, భారత్‌లో ఈ రోజుకు బ్రావో(శభాష్) అని ఎక్స్‌లో ఒక సందేశాన్ని పోస్ట్ చేసినట్టు ఫాక్స్ న్యూస్ పేర్కొంది. ఫ్రెంచ్ ప్రదర్శనలను, భారత్‌లోని విద్యార్థుల నిరసనలతో పోల్చినట్టు నివేదిక పేర్కొంది. ఈనెల 6న రాహుల్ గాంధీని నిర్బంధిస్తున్న క్లిప్‌ను పోస్ట్ చేస్తూ పార్లమెంట్‌లోని ప్రతిపక్ష నాయకుడిని న్యూఢిల్లీలో అరెస్టు చేస్తున్నారు. భారత ప్రభుత్వానికి సిగ్గుచేటు. ఢిల్లీ ప్రభుత్వానికి సిగ్గుచేటు అని ఇండియన్ అలయన్స్ పారిస్ రాసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

