ముంబై, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలోని నవలే వంతెనపై గురువారం జరిగిన ఘోర ప్రమాదానికి సంబంధించిన షాకింగ్ వీడియో వైరల్ అవుతున్నది. ఘటనా స్థలం లో చెల్లా చెదురుగా పడి ఉన్న డబ్బు, బంగారు నగలను చాలా మంది సేకరిస్తున్నట్టు వీడియోలో కనిపిస్తున్నది. బాధితులను రక్షించడం మరచి డబ్బు, బంగారం సేకరించడం మానవత్వానికే కళంకం అని నెటిజన్లు మండి పడుతున్నారు.
ఓ కంటైనర్ నియంత్రణ కోల్పోయి దాదాపు పది వాహనాలను ఢీకొట్టింది. ఓ కారు మంటల్లో చికుకున్నది. ఈ ప్రమాదంలో 8 మంది మరణించారు. మృతదేహాలను తొలగిస్తున్నప్పుడు స్వాతి అనే మహిళ తన కూతురు చిన్నారి మోక్షితను ఒడిలో గట్టిగా పట్టుకున్న దృశ్యం అందర్నీ కంటతడి పెట్టించింది.