న్యూఢిల్లీ: టైమ్ హయ్యర్ ఎడ్యుకేషన్ మ్యాగజైన్ ప్రకటించిన వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో రికార్డుస్థాయిలో భారత్ నుంచి 91 యూనివర్సిటీలకు చోటు దక్కింది. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) టాప్- 250లోకి ప్రవేశించింది. దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన పలు ఐఐటీలు ఈ ర్యాంకింగ్స్లో నాలుగేండ్లుగా పాల్గొనడం లేదు.
గత ఏడాది 75 వర్సిటీలకు జాబితాలో చోటు దక్కగా, ఈ సారి ఆ సంఖ్య 91కి పెరిగింది. అన్నా యూనివర్సిటీ, జామియా మిలియా ఇస్లామియా, మహాత్మాగాంధీ యూనివర్సిటీ, షూలినీ యూనివర్సిటీ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ సైన్సెస్ యూనివర్సిటీలు 501-600 మధ్య ర్యాంకులు సాధించాయి.