Europe | న్యూఢిల్లీ : యూరోపియన్లలో ప్రమాదకర రసాయనం ఉన్నట్టు తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. ఆరోగ్యానికి చేటు చేసే ఈ రసాయనం యూరోపియన్లందరి శరీరాల్లోనూ ఉన్నట్లు తెలిపింది. ఈ రసాయనం శరీరంలోని హార్మోన్లను దెబ్బతీస్తుందని అధ్యయనం పేర్కొంది. యూరోపియన్ ఎన్విరాన్మెంట్ ఏజెన్సీ నేతృత్వంలో నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెలుగుచూశాయి.
యూరోప్‌లోని 11 దేశాల్లోని వయోజనుల్లో 71 శాతం మందికిపైగా శరీరంలో బిస్ఫెనాల్ ఏ రసాయనం ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. బిస్ఫెనాల్ ఏను మోతాదుకు మించి వినియోగించడం వల్ల రొమ్ము క్యాన్సర్, సంతానోత్పత్తి సామర్థ్య లోపం వంటి సమస్యలు వస్తాయని ఈ అధ్యయనంలో వెల్లడైంది.