Cancer | న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: క్యాన్సర్ లక్షణాలను తగ్గించే సామర్థ్యం గంజాయి మొక్కల్లో ఉందని తాజా అధ్యయనం వెల్లడించింది. క్యాన్సర్ చికిత్సలో గంజాయి (మెడికల్) వాడకాన్ని సమర్థించే ముఖ్యమైన ఆధారాలను కొత్త అధ్యయనం కనుగొన్నది. గంజాయి మొక్కల్లో ఔషధ గుణాలు క్యాన్సర్ వ్యాధిని ఎదుర్కొనగలదని ‘ఫ్రాంటియర్స్ ఇన్ ఆంకాలజీ’ జర్నల్ కథనం పేర్కొన్నది.
ముఖ్యంగా క్యాన్సర్ లక్షణాలను పరిష్కరించటంలో గంజాయి సామర్థ్యం అద్భుతంగా ఉందని పరిశోధకులు తేల్చారు.