న్యూఢిల్లీ: వాట్సాప్‌లో వాయిస్ మెసేజ్‌ను టెక్ట్స్‌గా మార్చుకునే ట్రాన్స్‌స్క్రిప్ట్ ఫీచర్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు మెటా సంస్థ గురువారం ప్రకటించింది. వినియోగదారులు సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఈ ఆప్షన్‌ను ఎనబుల్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఒకసారి ఎనబుల్ చేసిన తర్వాత ప్రతి వాయిస్ మెసేజ్ ఆటోమెటిక్‌గా టెక్ట్స్ రూపంలోకి మారిపోతుంది. ఈ టెక్ట్స్ కేవలం మెసేజ్‌ను అందుకున్న యూజర్ మాత్రమే చూడగలరని, ఇంగ్లీష్, స్పానిష్, రష్యన్ సహా పలు భాషల్లో వాయిస్ మెసేజ్‌ను టెక్ట్స్‌గా మార్చుకునే అవకాశం ఉంటుందని తెలిపింది. అయితే, ట్రాన్స్‌స్క్రిప్ట్‌లను ఎక్కడ స్టోర్ చేస్తుందనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.