అహ్మదాబాద్: గుజరాత్‌లోని దీసా పట్టణానికి సమీపంలోని పటాకుల గోదాములో మంగళవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో మధ్యప్రదేశ్‌కు చెందిన 21 మంది కార్మికులు, వారి కుటుంబ సభ్యులు దుర్మరణం చెందగా, ఆరుగురు గాయపడ్డారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం బాయిలర్ పేలడంతో గోదాము పైకప్పు, కొన్ని గోడలు కూలిపోయాయని జిల్లా ఎస్పీ తెలిపారు. అగ్నిమాపక శాఖ వెంటనే మంటలను అదుపు చేసిందని చెప్పారు. మృతుల కుటుంబాలకు గుజరాత్ సీఎం రూ.4 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.