ఇంఫాల్: శరీరం ఫిట్‌గా ఉండటం కోసం చాలామంది రోజూ ఉదయం లేదా సాయంత్రం వేళల్లో పుష్ అప్స్ చేస్తుంటారు. ఈ పుష్ ఆప్స్ చేయడం అనేది అంత ఈజీగా అయ్యే పనికాదు. ఒకటి, రెండు, మూడు, నాలుడు, ఐదు ఇలా పుష్ అప్స్ సంఖ్య పెరుగుతున్నా కొద్దీ ఒంట్లో నరాలన్నింటినీ బిగపట్టుకుని శక్తిని కూడదీసుకోవాల్సి వస్తుంది. అందుకే కొందరు 10 పుష్ ఆప్స్ కూడా సక్రమంగా చేయలేక పోతారు.
ఇక, బాగా సాధాన చేసేవాళ్లు 20, 30, 50 పుష్ అప్స్ కూడా చేయగలుగుతారు. ఇంకా కఠోర సాధన చేసేవాళ్లయితే ఏకంగా 100 పుష్ అప్స్ కూడా చేయగలుగుతారు. ఏకధాటిగా 100 పుష్ అప్స్ అంటే ఆశ్చర్యంగా ఉంది కదా..! మరి ఓ వ్యక్తి 100కు పైగా పుష్ ఆప్స్‌ను కేవలం ఒకే నిమిషంలో చేస్తే ఇంకెంత ఆశ్చర్యపోతారు..? మీరు చదివేది నిజమే.. మణిపూర్‌కు చెందిన థౌనఓజమ్ నిరంజోయ్ సింగ్ అనే 24 ఏండ్ల యువకుడు నిమిషంలో 50 కాదు, 100 కాదు ఏకంగా 109 పుష్ అప్స్ చేసి గిన్నిస్ రికార్డు నెలకొల్పాడు.
అయితే, ఈ విజయం అతనికి అంత అవలీలగా దక్కలేదు. ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఆ యువకుడి విజయం వెనుక అతని 13 ఏండ్ల కఠోర సాధన దాగివుంది. థౌనఓజమ్ నిరంజోయ్ సింగ్ పుష్ అప్స్లో గతంలోనే రెండు గిన్నిస్ రికార్డులు సొంతం చేసుకున్నాడు. తాజాగా నిమిషంలో 109 పుష్ అప్స్ చేసి 105 పుష్ అప్స్‌తో తన పేరిటే ఉన్న గిన్నిస్ వరల్డ్ రికార్డును తనే బద్ధలు కొట్టాడు. దాంతో థౌనఓజమ్పై కేంద్రమంత్రి కిరెన్ రిజుజు సహా పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.
#WATCH | Thounaojam Niranjoy Singh from Manipur broke the Guinness Book of World Records last week for most push-ups (finger tips) in one minute pic.twitter.com/arSF5ZySUZ
— ANI (@ANI) January 23, 2022