న్యూఢిల్లీ : గర్ల్‌ఫ్రెండ్ కోసమో, నాలుగు కబుర్లు చెప్పే స్నేహితుడు దొరుకుతాడనో డేటింగ్ యాప్స్ సాయం తీసుకునే వారుంటారు. అయితే డేటింగ్ యాప్‌ను వాడుతూ ఓ వ్యక్తి ఏకంగా జాబ్‌ను పట్టేశాడు. దీనికి సంబంధించిన ఫన్నీ పోస్ట్‌ను అతడు ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. అద్నాన్ ఖాన్ అనే వ్యక్తి బంబుల్ సైట్లో సాగించిన చాట్ స్క్రీన్షాట్నూ సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
ఓ స్టార్టప్ టాలెంట్ అక్విజిషన్ విభాగంలో హెచ్ఆర్ ఉద్యోగితో అద్నాన్ చాట్ చేశాడు. ఆపై తాను ఎలక్ట్రికల్, కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ చేస్తున్నానని అద్నాన్ చెప్పాడు. తనను స్టార్టప్‌కు రిఫర్ చేయాలని కూడా పనిలో పనిగా కోరాడు.
మీరు ఎలాంటి జాబ్ కోసం చూస్తున్నారని హెచ్ఆర్ ఉద్యోగి అడగ్గా ఆ వివరాలను అద్నాన్ అందించాడు. జాబ్స్ కోసం మీరు లింక్డిన్ వాడతారు..నేను బంబుల్ వాడాను..రెండూ ఒకటి కాదు బ్రో అని పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చాడు. స్టార్టప్‌లో ఇంటర్వ్యూకు కూడా హాజరయ్యానని మరో ట్వీట్లో అద్నాన్ పేర్కొన్నాడు.