బెంగళూరులోని కర్ణాటక సిల్క్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ (కేఎస్ఐసీ) చీరల షోరూం ముందు సూర్యోదయం సమయానికి భారీ క్యూ కనిపించింది. మైసూర్ చీరలకు ఆకస్మికంగా డిమాండ్ పెరుగడం, అసలైన మైసూర్ పట్టు చీరలు కావాలంటేనే తమ వద్దకు రమ్మని నిర్వాహకులు ప్రకటించడమే దానికి కారణం. ఈ చీరలు మళ్లీ దొరుకుతాయో లేదోనన్న ఆత్రుతతో తెల్లవారుజామునే ఈ షాపునకు పరుగులు పెట్టారు పట్టుచీరల ప్రేమికులు. ఈ చీరల కనీస ధర రూ. 23,000 కాగా, గరిష్ఠ ధర రూ.2,50,000. అయినా తగ్గేదే లేదంటూ పట్టుచీరల అభిమానులు వాటి కోసం బారులు తీరడం విశేషం.