Assam | గువాహటి: అస్సాంలోని నాగావ్ జిల్లాలో ఈనెల 22న ట్యూషన్ నుంచి తిరిగి వస్తున్న ఓ బాలికపై కొంత మంది సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. రేప్ అంటే ఏంటి ఆంటీ? అని బాలిక తనను అడిగిన రెండు రోజులకే ఆమెపై ఆఘాయిత్యం జరిగిందని బంధువు ఒకరు మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌పై లైంగిక దాడి, హత్య ఘటన వార్తను చదివిన బాలిక ఈ మేరకు తనను ఈ ప్రశ్న అడిగిందని తెలిపారు.
ముంబై, ఆగస్టు 26: మహారాష్ట్రలోని బద్లాపూర్ బడిలో చిన్నారులపై లైంగిక వేధింపుల ఘటన నేపథ్యంలో స్కూల్లోని గత 15 రోజుల సీసీటీవీ ఫుటేజ్ మాయమైందని రాష్ట్ర విద్యా మంత్రి దీపక్ ఖేసర్కర్ సోమవారం తెలిపారు. ఈ నెల 14న ఘటన గురించి క్లాస్ టీచర్‌కు, ప్రిన్సిపల్‌కు తెలిపామని బాధితుల కుటుంబాలు చెప్తుండగా.. ఈ నెల 16న తమకు సమాచారం అందిందని స్కూల్ యాజమాన్యం చెప్తున్నది. ఈ తేడాపై విచారణ జరుపుతున్నట్టు మంత్రి తెలిపారు. ఈ క్రమంలో సీసీటీవీ ఫుటేజ్ మాయం కావడం స్కూల్ బాధ్యతపై కొత్త ప్రశ్నలు లేవనెత్తింది.