న్యూఢిల్లీ, జూలై 16: ఓ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడి.. ఆ ఘటనను వీడియో తీయడానికి యత్నించిన 30 ఏండ్ల వ్యక్తిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఛత్తీస్గఢ్ కోర్బా జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనపై ఆగ్రహించిన స్థానికులు నిందితుడి పౌల్ట్రీ దుకాణాన్ని ధ్వంసం చేశారు.
ఇద్దరు బాలికలు స్కూల్ నుంచి ఇంటికి వస్తుండగా, ఇంటి వద్ద దించుతానని నమ్మబలికిన నిందితుడు వారిద్దరిని తన వాహనంపై తీసుకెళ్లాడు. సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో వాహనాన్ని ఆపి ఒక బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.