నోయిడా: అద్దెకు తీసుకున్న ఇంటినే ల్యాబరేటరీగా మార్చి డ్రగ్స్ తయారు చేస్తున్న విదేశీ సభ్యుల ముఠాను యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.200 కోట్ల మత్తుమందు స్వాధీనం చేసుకున్నారు. సమాచారం మేరకు గ్రేటర్ నోయిడాలోని ఓ భవనంపై పోలీసులు దాడి చేశారు. ఇంటిలోపలే ప్రయోగశాల ఏర్పాటు చేసి డ్రగ్స్ తయారు చేస్తున్న ఆఫ్రికా దేశానికి చెందిన తొమ్మిది మందిని అరెస్ట్ చేసినట్టు బుధవారం వెల్లడించారు.