న్యూఢిల్లీ: ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఏబీవీపీ, వామపక్ష విద్యార్థుల మధ్య ఘర్షణ(Students Clash) తలెత్తింది. దీంతో ఆ విద్యార్థులు కొట్టుకున్నారు. ఓ వ్యక్తి తన వద్ద ఉన్న కర్రతో ఓ గ్యాంగ్‌పై దాడి చేశాడు. స్కూల్ ఆఫ్ లాంగ్వేజెస్ వద్ద ఎలక్షన్ కమిటీ సభ్యుల మధ్య ఘర్షణ జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. రెండు గ్రూపుల మధ్య జరిగిన కొట్లాటలో కొందరు గాయపడ్డారు. ఘటనకు చెందిన వీడియోలు రిలీజ్ అయ్యాయి. ఓ వ్యక్తి గుంపుపై సైకిల్ విసిరేసిన వీడియో కూడా రిలీజైంది. వర్సిటీకి చెందిన సెక్యూర్టీ అడ్డుకున్నా.. కొందరు వ్యక్తులు తీవ్ర ఘర్షణకు దిగారు.
#WATCH | Delhi | A clash broke out between ABVP and Left-backed student groups at Jawaharlal Nehru University (JNU), last night. The ruckus was reportedly over the selection of election committee members at the School of Languages.
(Video Source: JNU students)
(Note: Abusive… pic.twitter.com/BfpFlhUM2T— ANI (@ANI) March 1, 2024
ఏబీవీపీ, లెఫ్ట్ విద్యార్థి సంఘాలు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై యూనివర్సిటీ యాజమాన్యం ప్రకటన చేయాల్సి ఉంది. ఎంత మంది గాయపడ్డారన్న విషయంపై వర్సిటీ ఇంకా ప్రకటన చేయలేదు.
రెండు వైపుల నుంచి ఫిర్యాదులు అందాయని, ఆ ఘటనలో దర్యాప్తు మొదలుపెట్టినట్లు పోలీసులు చెప్పారు. ఈ ఎపిసోడ్లో ముగ్గురు గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు.