న్యూఢిల్లీ: వ్యక్తుల బ్లడ్గ్రూపును బట్టి స్ట్రోక్ ముప్పును ముందే అంచనావేయొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. యువకుల్లో స్ట్రోక్ ముప్పును ముందే గుర్తించి, నివారించేందుకు ఇది దోహదపడుతుందని పేర్కొంటున్నారు. మిగతా బ్లడ్ గ్రూపుల వారితో పోలిస్తే ‘ఏ’ బ్లడ్‌గ్రూప్ వారిలో 60 ఏండ్లకంటే ముందు స్ట్రోక్ వచ్చే ముప్పు ఎక్కువగా ఉందని వెల్లడించారు. యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన నిర్వహించారు.