కొచ్చి, జూలై 30: ఐదేండ్ల చిన్నారిపై ఓ మృగాడు అత్యంత పైశాచికంగా లైంగికదాడికి పాల్పడ్డాడు. గొంతుకోసి హతమార్చాడు. కేరళలోని ఆలూవా పట్టణ మార్కెట్కు సమీపంలో ఆ బాలిక మృతదేహం లభ్యమైంది. ఆదివారం బాలిక మృతదేహానికి అంత్యక్రియలు చేపట్టగా, స్థానికులు, రాజకీయ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
చిన్నారిని క్షేమంగా ఇంటికి తీసుకురాలేనందుకు కేరళ పోలీసు శాఖ బాధిత కుటుంబ సభ్యులకు క్షమాపణలు తెలిపింది.‘చిన్నారిని ఎలా చంపాడో అతడ్ని కూడా అలాగే చంపాలి’ అంటూ ప్రజలు నినదించారు.