Uttar Pradesh | ఆగ్రా: బ్యాటరీలు, బ్లేడ్లు, స్క్రూలు వంటి 65 వస్తువులను మింగిన ఓ బాలుడు(14) క్లిష్టమైన శస్త్ర చికిత్స జరిగిన కొన్ని గంటలకే మృతి చెందాడు. గత నెల 28న ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ దవాఖానలో ఈ ఘటన జరిగింది. పేగు ఇన్ఫెక్షన్ వల్ల బాలుడు మృతి చెందాడని దవాఖాన అధికారి ఒకరు తెలిపారు. హాథ్రస్లో నివసించే బాలుడికి గత నెల 13న శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో ఆగ్రాలోని ఓ దవాఖానకు తీసుకెళ్లారు. ఆ తర్వాత అది నయమైనా, కడుపు నొప్పి తలెత్తడంతో సరైన చికిత్స కోసం నాలుగు నగరాలు తిరిగారు. చివరకు ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ దవాఖానలో చేసిన స్కానింగ్‌లో అతడి పొట్టలో 65 వస్తువులు గుర్తించి ఆపరేషన్ నిర్వహించారు.