తిరువనవంపురం: న్యాయవాద వృత్తిలో కేరళకు చెందిన ఒక న్యాయవాది అరుదైన రికార్డు సాధించారు. పాలక్కడ్ జిల్లాకు చెందిన బాలసుబ్రమణియన్ మీనన్ 73 ఏండ్ల 60 రోజుల పాటు న్యాయవాద వృత్తిలో కొనసాగుతూ సుదీర్ఘ కాలం న్యాయవాదిగా ఉన్నందుకు గిన్నిస్ రికార్డు సాధించారు. 1950లో యువకుడిగా ఉన్నప్పుడు న్యాయవాద వృత్తిలోకి వచ్చిన మీనన్ 97 ఏండ్ల వయసులో కూడా ఉత్సాహంగా కేసులు వాదిస్తున్నారు. తనకు ఆరోగ్యం సహకరించే వరకు ఈ వృత్తిలోనే కొనసాగుతానన్నారు.