కోల్కతా: ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక్క రోజే 9 మంది నవజాత శిశువులు మరణించారు. (Newborns Die in Hospital) రెండేళ్ల వయసున్న చిన్నారి కూడా చనిపోయింది. పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గత 24 గంటల్లో ముర్షిదాబాద్ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో 9 మంది నవజాత శిశువులు మరణించారు. రెండేళ్ల చిన్నారి కూడా చనిపోవడం కలకలం రేపింది. అయితే పోషకాహార లోపం, పుట్టుకతో వచ్చే గుండె సంబంధ వ్యాధులు, తక్కువ బరువుతో పుట్టిన నవజాత శిశువులు చనిపోయినట్లు ఆసుపత్రి అధికారులు తెలిపారు.
కాగా, చాలా మంది శిశువులు 500 గ్రాములు లేదా 600 గ్రాముల తక్కువ బరువుతో పుట్టారని, వారంతా ఇతర ఆసుపత్రుల నుంచి చాలా ఆలస్యంగా ఇక్కడ అడ్మిట్ అయ్యారని మెడికల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ కమ్ వైస్ ప్రిన్సిపల్ అమిత్ కుమార్ దాహ్ తెలిపారు. ఈ నేపథ్యంలో అలాంటి శిశువులను కాపాడటం చాలా కష్టమని అన్నారు. అయితే ఒకే రోజు 9 మంది నవజాత శిశువుల మరణించడంపై దర్యాప్తు చేసేందుకు కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.