న్యూఢిల్లీ: తన జోక్యంతోనే కాల్పుల విరమణకు భారత్, పాకిస్థాన్ అంగీకరించాయన్న తన వాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. బుధవారం ఫ్లోరిడాలోని మియామీలో జరిగిన ఓ కార్యక్రమంలో ట్రంప్ ప్రసంగిస్తూ తన పాత వాదనకు అదనపు అంశాలను జోడించారు.
తన జోక్యం తర్వాత మరుసటి రోజు తనకు ఫోన్ కాల్ వచ్చిందని, తాను పెట్టిన వాణిజ్య షరతుల కారణంగానే కాల్పుల విరమణ కుదుర్చుకున్నట్లు వారు చెప్పారని ట్రంప్ తెలిపారు. సైనిక ఘర్షణలో మొత్తం 8 విమానాలు కూలిపోయాయని చెప్పారు.