లక్నో: బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి (Stray Dogs Attacks Boy). ఐదు కుక్కలు అతడ్ని చుట్టుముట్టి కరిచాయి. ఆ చిన్నారి భయంతో అరవడంతో స్థానికులు వెంటనే స్పందించారు. చేతికి అందిన వస్తువులను కుక్కల మీదకు విసిరి వాటి బారి నుంచి బాలుడ్ని కాపాడారు. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం సాయంత్రం ఏడేండ్ల విరాట్ చాకెట్లు కొనడం కోసం పక్కనే ఉన్న షాప్‌నకు వెళ్లేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చాడు. ఇంతలో ఆ వీధిలో ఉన్న ఐదు కుక్కలు విరాట్‌పై దాడి చేశాయి. అతడ్ని చుట్టుముట్టి కరిచాయి. ఆ బాలుడు భయంతో కేకలు వేశాడు.
కాగా, విరాట్ అరుపులు విన్న స్థానికులు వెంటనే స్పందించారు. కర్రలు వంటి వస్తువులను కుక్కలపైకి విసిరి తరిమారు. వాటి బారి నుంచి ఆ బాలుడ్ని కాపాడారు. అరుపులు విన్న విరాట్ తల్లి లక్ష్మీ కూడా పరుగున బయటకు వచ్చింది. కుమారుడ్ని కుక్కలు కరువడంపై ఆందోళన చెందింది. తీవ్రంగా గాయపడిన ఆ చిన్నారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
మరోవైపు వీధి కుక్కలు పిల్లలపై దాడులు చేస్తున్నాయని స్థానికులు ఆరోపించారు. మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని బాధిత బాలుడి తల్లిదండ్రులు విమర్శించారు. అయితే బాలుడిపై కుక్కల దాడికి సంబంధించిన వీడియో క్లిప్ వైరల్ అయ్యింది. దీంతో మున్సిపల్ సిబ్బంది స్పందించారు. వీధి కుక్కలను పట్టే బృందాలను సోమవారం ఆ ప్రాంతానికి పంపారు.
वीडियो झांसी का है जहां एक बच्चे पर एक साथ 5 डॉग्स ने अटैक किया बच्चा बुरी तरह डर गया है,घायल है@jhansipolice
@nagarnigamjhansi pic.twitter.com/ph4P4jJzmE— shalu agrawal (@shaluagrawal3) August 14, 2023