ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి.. మృతుల్లో నలుగురు పిల్లలు
పోలీసులు ఆ ఇంటి వద్దకు వచ్చారు. తలుపులు బద్ధలుకొట్టి లోనికి వెళ్లి చూశారు. ప్రకాష్, ముగ్గురు పిల్లలు సీలింగ్‌కు వేలాడుతూ చనిపోగా, భార్య దుర్గా, మరో చిన్నారి నేలపై విగతజీవులుగా పడి ఉన్నారు.
జైపూర్: ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అనుమానాస్పద స్థితిలో మరణించారు. మృతుల్లో నలుగురు పిల్లలు ఉన్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గోగుండా పట్టణానికి చెందిన ప్రకాష్ గామేటి, 27 ఏళ్ల భార్య దుర్గా, వారి నలుగురు పిల్లలతో కలిసి తన సోదరుల ఇళ్లకు సమీపంలోని ఇంటిలో నివసిస్తున్నాడు. సోమవారం ఎంతసేపటికీ వారి ఇంటి తలుపు తెరుచుకోలేదు. దీంతో ప్రకాష్ సోదరుడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
ఈ నేపథ్యంలో పోలీసులు ఆ ఇంటి వద్దకు వచ్చారు. తలుపులు బద్ధలుకొట్టి లోనికి వెళ్లి చూశారు. ప్రకాష్, ముగ్గురు పిల్లలు సీలింగ్‌కు వేలాడుతూ చనిపోగా, భార్య దుర్గా, మరో చిన్నారి నేలపై విగతజీవులుగా పడి ఉన్నారు. భార్య శరీరంపై గాయాలున్నట్లు పోలీసులు తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఆ కుటుంబం ఈ కఠిన నిర్ణయం తీసుకుని ఉంటుందని అనుమానించారు.
కాగా, ప్రకాష్ తొలుత తన భార్య, చిన్నారిని గొంతునులిమి హత్య చేసిన తర్వాత ముగ్గురు పిల్లలను సీలింగ్‌కు వేలాడదీసి చంపి చివరకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఫోరెన్సిక్ బృందం, డాగ్ స్క్వాడ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. మృతుడు ప్రకాష్ గుజరాత్లో పని చేసేవాడని, బస్సుల్లో పళ్లు అమ్మేవాడని పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఢిల్లీని గడ గడ లాడించిన చరిత్ర కేసీఆర్‌దే : ఎంపీ వద్ది రాజు రవి చంద్ర
KTR | జనాభా లెక్కల ఆధారంగా మా గొంతు కోస్తే ఊరుకోం.. నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్ వివరణ
Rayapati | అనారోగ్యంతో మాజీ ఎంపీ రాయపాటి కన్నుమూత..!
Student Attempts Suicide | ర్యాగింగ్ వల్ల వైద్య విద్యార్థి ఆత్మహత్యాయత్నం.. ఐదుగురు సీనియర్లు సస్పెండ్
BRS | మహమ్మద్ తాజుద్దీన్ బాబా కుటుంబానికి రూ. 10లక్షలు ఆర్థిక సాయం
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

