న్యూఢిల్లీ, మే 22: విధి నిర్వహణలో అసాధారణ పరాక్రమం ప్రదర్శించిన ఆర్మీ, జమ్ముకశ్మీర్ పోలీసులకు చెందిన ఆరుగురికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం కీర్తి చక్ర పురస్కారాలను ప్రదానం చేశారు.
కీర్తిచక్ర భారత దేశంలో రెండో అత్యున్నత స్థాయి శౌర్య పురస్కారం. గురువారం రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో 33 మందికి శౌర్య చక్ర పురస్కారాలను కూడా రాష్ట్రపతి అందజేశారు.