న్యూఢిల్లీ: గుజరాత్‌లోని పంచమహల్ జిల్లా, పావగఢ్ కొండపై శనివారం కార్గో రోప్‌వే కేబుల్ తీగ తెగిపోవడంతో ఆరుగురు మరణించారు. ఈ కొండపై మహాకాళిక దేవాలయం ఉంది. పోలీసు సూపరింటెండెంట్ హరేష్ డుధట్ మాట్లాడుతూ, ఈ సంఘటనలో ఆరుగురు మరణించారని, పోలీసు, అగ్నిమాపక సిబ్బంది సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. పంచమహల్ కలెక్టర్ అజయ్ దహియా మాట్లాడుతూ మృతుల్లో ఇద్దరు లిఫ్ట్ ఆపరేటర్లు, ఇద్దరు కూలీలు ఉన్నారన్నారు. ప్రధాన రోప్ వేని రెండు రోజుల నుంచి మూసేసినట్లు తెలిపారు.