డెహ్రాడూన్: రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారమ్‌పై పెద్ద పాము కనిపించింది. (Snake On Platform) ఇది చూసి ప్రయాణికులు భయాందోళన చెందారు. ఆ ప్లాట్‌ఫారమ్‌పై పరుగులు తీశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం ఉదయం రిషికేశ్‌లోని యోగనగరి రైల్వే స్టేషన్లో రైలు పట్టాలపై ఆరు అడుగుల పొడవైన పాము కనిపించింది. ఆ పాము పాకుతూ ప్లాట్‌ఫారమ్‌పైకి చేరింది.
కాగా, ఆ పెద్ద పామును చూసి ఆ ప్లాట్‌ఫారమ్‌పై ఉన్న ప్రయాణికులు భయాందోళన చెందారు. అక్కడి నుంచి దూరంగా పరుగెత్తారు. కొందరు తమ లగేజ్ వదిలేసి పరుగులు తీశారు. ఆ ప్లాట్‌ఫారమ్‌పై పాము ఉన్నట్లు అక్కడున్న వారిని అప్రమత్తం చేశారు. ఈ విషయాన్ని రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆ రైల్వే స్టేషన్లో గందరగోళం ఏర్పడింది. ప్లాట్‌ఫారమ్‌పై పెద్ద పాము పాకుతూ వెళ్తున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ऋषिकेश रेलवे स्टेशन पर दिखाई दिया अजगर, यात्रियों में मची अफरा-तफरी#Rishikesh #railwaystation #news pic.twitter.com/i0ZycLYWSz
— Khabar Uttarakhand (@KUttarakhand) September 20, 2024