న్యూఢిల్లీ, నవంబర్ 13 : దేశంలో మరణించిన వారి ఆధార్ కార్డులు కోట్ల సంఖ్యలో క్రియాత్మకంగా ఉండటం పట్ల ప్రభుత్వం ఆందోళన చెందుతున్నది. భారత్‌లో 2009 జనవరిలో ఆధార్ కార్డుల విధానాన్ని ప్రవేశపెట్టారు. అయి తే అప్పటి నుంచి 8 కోట్ల మంది పౌరులు మరణించగా, వారిలో 1.83 కోట్ల కార్డులు మాత్రమే క్రియారహితం అయ్యాయి.
అంటే మరణించిన ఆరు కోట్ల మంది భారతీయుల ఆధార్ కార్డులు యాక్టివ్గానే ఉన్నాయి. ఇది బ్యాంక్‌ల మోసం, తప్పుడు అకౌంట్లు, ప్రభుత్వ సంక్షేమ పథకాల దుర్వినియోగం దారి తీయవచ్చునని ప్రభుత్వం ఆందోళన చెం దుతున్నది. పశ్చిమ బెంగాల్లో కూడా మరణించిన వారి కార్డులు క్రియాశీలకంగా ఉన్నాయి.