బుధవారం 08 జూలై 2020
National - Jun 25, 2020 , 20:55:25

గుజ‌రాత్‌లో 577, హ‌ర్యానాలో 453 క‌రోనా కేసులు

గుజ‌రాత్‌లో 577, హ‌ర్యానాలో 453 క‌రోనా కేసులు

హైద‌రాబాద్‌: దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి విస్త‌ర‌ణ కంటిన్యూ అవుతున్న‌ది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో కేసులు సంఖ్య రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతున్న‌దే త‌ప్ప త‌గ్గ‌డం లేదు. గురువారం కొత్త‌గా గుజ‌రాత్‌లో 577, హ‌ర్యానాలో 453 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. గుజ‌రాత్‌లో కొత్త‌గా న‌మోదైన 577 కేసుల‌తో క‌లిపి మొత్తం కేసుల సంఖ్య 29,578కి చేరింది. అందులో 21,506 మంది వైర‌స్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, మిగ‌తా వారు వివిధ ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. గుజ‌రాత్‌లో ఇప్ప‌టివ‌ర‌కు మ‌ర‌ణించిన క‌రోనా బాధితుల సంఖ్య కూడా 1754కు చేరింది.

ఇక హ‌ర్యానాలో కొత్త‌గా న‌మోదైన 453 కేసుల‌తో క‌లిపి మొత్తం కేసుల సంఖ్య 12,463కు చేరింది. వారిలో 7,380 మంది ఇప్ప‌టికే వైర‌స్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మిగ‌తా వారు వివిధ‌ ఐసోలేష‌న్ కేంద్రాల్లో చికిత్స పొందుతున్నారు. హ‌ర్యానాలో క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య కూడా రోజురోజుకు క్ర‌మంగా పెరుగుతూ 198కి చేరింది. గుజ‌రాత్‌, హ‌ర్యానా రాష్ట్రాల ఆరోగ్య శాఖ‌ల అధికారులు ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించారు.        


logo