GST Council Meeting | వస్తు, సేవల పన్ను (GST)కు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే జీఎస్టీ కౌన్సిల్ సమావేశం (GST Council Meeting) వచ్చే నెలలో జరగనుంది. అక్టోబర్ 7వ తేదీన న్యూఢిల్లీలోని (New Delhi) విజ్ఞాన్ భవన్ (Vigyan Bhavan)లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) అధ్యక్షతన 52వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ఆయా రాష్ట్రాలకు చెందిన ఆర్థిక మంత్రులు హాజరుకానున్నారు. ఈ విషయాన్ని జీఎస్టీ కౌన్సిల్ ట్విట్టర్ (ఎక్స్) ద్వారా వెల్లడించింది. అయితే, ఈ భేటీలో ఏయే అంశాలపై చర్చించనున్నారో మాత్రం వెల్లడించలేదు. మరోవైపు 51వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఆగస్టు 2వ తేదీన జరిగిన విషయం తెలిసిందే. ఆ సమావేశంలో క్యాసినో, గుర్రపు పందేలు, ఆన్లైన్ గేమింగ్‌కు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
Also Read..
Anand Mahindra | ఆనంద్ మహీంద్రాపై చీటింగ్ కేసు నమోదు
Viral video | షాకింగ్.. ఇంటి కిటికీలో చిక్కుకుపోయిన పేద్ద పైతాన్‌ను ఎలా రక్షించారో చూడండి
India-Canada | తీవ్రవాదులకు అడ్డాగా మారిన కెనడా.. భారత్‌కు మద్దతుగా నిలిచిన శ్రీలంక