హైదరాబాద్, (నమస్తే తెలంగాణ): ఓ అంతర్జాతీయ విమానంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 32 ఏండ్ల మహిళపై ఆమె పక్కన కూర్చొన్న తోటి ప్రయాణికుడు అసభ్యకరంగా ప్రవర్తించి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ నెల 6న జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్డ్ నుంచి బెంగళూరుకు బయల్దేరిన లుఫ్తాన్సా విమానంలో ఈ ఘటన జరిగింది. నిందితుడిని అదుపులోకి తీసుకొన్న పోలీసులు.. ఐపీసీ సెక్షన్ 354ఏ కింద కింద కేసు నమోదు చేశారు.