గురుగ్రామ్: ఓ ప్రొఫెసర్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని హర్యానాకు చెందిన దాదాపు 500 మంది విద్యార్థినులు ఆరోపించడం సంచలనంగా మారింది. ఫ్రొఫెసర్‌పై చర్యలు తీసుకోవాలని వారు ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తోపాటు గవర్నర్ బండారు దత్తాత్రేయ, మహిళా కమిషన్‌కు లేఖ రాశారు. చౌదరి దేవీలాల్ యూనివర్సిటీలో ఈ ఘటన చోటుచేసుకుంది. చాంబర్లోకి పిలిచి ప్రొఫెసర్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడేవారని విద్యార్థినులు ఆరోపించారు. వర్సిటీలోని అంతర్గత ఫిర్యాదుల కమిటీకి గతంలో ఫిర్యాదు చేసినప్పటికీ ఆయనకు క్లీనిచిట్ ఇచ్చినట్టు వాపోయారు. విద్యార్థులపై ఆరోపణలపై దర్యాప్తునకు పోలీసులు సిట్ ఏర్పాటుచేశారు.