50-70% తగ్గిన క్యాంపస్ ప్లేస్మెంట్లు
ఇంజినీరింగ్ చివరి ఏడాది విద్యార్థులు ఉద్యోగాల కోసం మరికొన్ని నెలలు ఎదురు చూడాల్సిన పరిస్థితులు తప్పేలా లేవు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్లేస్మెంట్లు 50-70 శాతం తగ్గిపోయాయి.
- ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో నిరాశాజనకంగా రిక్రూట్మెంట్
- ఆర్థిక సవాళ్ల నేపథ్యంలో ఆచితూచి వ్యవహరిస్తున్న ఐటీ కంపెనీలు
న్యూఢిల్లీ: ఇంజినీరింగ్ చివరి ఏడాది విద్యార్థులు ఉద్యోగాల కోసం మరికొన్ని నెలలు ఎదురు చూడాల్సిన పరిస్థితులు తప్పేలా లేవు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్లేస్మెంట్లు 50-70 శాతం తగ్గిపోయాయి. ఆర్థిక మందగమన పరిస్థితుల నేపథ్యంలో నూతన ఉద్యోగుల నియామకంలో ఐటీ కంపెనీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ఆటోమొబైల్, ఏరోనాటిక్స్, బయో టెక్నాలజీ, బయో మెడికల్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ తదితర విభాగాల్లోనూ రిక్రూట్మెంట్ తగ్గిపోయిందని కాలేజీలు చెప్తున్నాయి. దీంతో దేశీయ కంపెనీల రిక్రూట్మెంట్ డ్రైవ్‌ల కోసం ప్రయత్నించాలని అమిటీ యూనివర్సిటీ నిర్ణయించింది. ఈ సారి ప్లేస్మెంట్ల పరిస్థితి నిరాశనకంగా ఉందని కేఎల్ యూనివర్సిటీ సీనియర్ ప్లేస్మెంట్ డైరెక్టర్ శరవణబాబు తెలిపారు.
ఇంజినీరింగ్ విభాగంలో గత ఏడాది (2023 బ్యాచ్) తమ యూనివర్సిటీ విద్యార్థులు 80 శాతం మంది క్యాంపస్ ప్లేస్మెంట్లో ఉద్యోగాలు పొందగా ఈఏడాది (2024 బ్యాచ్) 35 శాతం మంది మాత్రమే ఉద్యోగాలకు ఎంపికయ్యారని వెల్లడించారు. ఫ్రెషర్ల ఎంపికలో పరిశ్రమ వర్గాలు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయని శారదా వర్సిటీ వైస్‌ఛాన్సలర్ పర్మానంద్ తెలిపారు. ‘గత ఏడాది కొన్ని కంపెనీలు పరిమితికి మించి నియమించుకోవడం కూడా ఈ ఏడాది ప్లేస్మెంట్లు తగ్గడానికి కారణం. చాలా కొత్త కంపెనీలు, ముఖ్య ంగా స్టార్టప్‌లు ఈ ఏడాది రిక్రూట్మెంట్ చేసుకుంటాయి’ అని ఓకాలేజీ చీఫ్ ఇండస్ట్రీ ఎంగేజ్మెంట్ ఆఫీసర్ అంచనా వేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

