లక్నో: కొందరు హిజ్రాలు (transgenders) రెచ్చిపోయారు. ఒక వ్యక్తికి గుండు కొట్టించారు. ఆపై అతడిపై మూత్ర విసర్జన చేశారు. అంతటితో ఆగక మూత్రం తాగాలని బలవంతం చేశారు. అలాగే అతడి వద్ద ఉన్న పది వేల నగదును దోచుకున్నారు. ఉత్తరప్రదేశ్లోని కాస్గంజ్ జిల్లాలో ఈ దారుణ సంఘటన జరిగింది. రఫీకుల్ అనే వ్యక్తి ఒక హిజ్రా ఇంట్లో పనిచేశాడు. అయితే ఆ హిజ్రా ఇంట్లో పనిమానేసిన అతడు మరో హిజ్రా ఇంట్లో పని చేస్తున్నాడు. దీనిపై కొందరు హిజ్రాలు ఆగ్రహం చెందారు. జూలై 26న ఇంటికి వెళ్తున్న రఫీకుల్ను ఐదుగురు హిజ్రాలు అడ్డుకున్నారు. ముగ్గురు హిజ్రాలు అతడికి గుండు చేశారు. ఆ తర్వాత మరో హిజ్రా అతడిపై మూత్ర విసర్జన చేశాడు. మూత్రం తాగాలని అతడ్ని బలవంతం చేశారు.
కాగా, బాధితుడు రఫీకుల్ ఈ దారుణ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హిజ్రాలు తనకు గుండు చేయడంతోపాటు తనపై మూత్ర విసర్జన చేసినట్లు ఆరోపించాడు. మూత్రం తాగాలని బలవంతం చేయడంతోపాటు తన వద్ద ఉన్న పది వేల నగదు దోచుకున్నారని చెప్పాడు. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేశారు. నిందితులైన ఐదుగురు ట్రాన్స్జెండర్లను అరెస్ట్ చేశారు. ఈ దారుణంపై దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో దళిత వ్యక్తులపై మూత్ర విసర్జన చేసిన సంఘటనలు ఇటీవల జరిగాయి. తాజాగా మరో బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో ఇలాంటి దారుణం జరుగడంపై విమర్శలు వెల్లువెత్తాయి.
वीडियो वायरल
कासगंज में किन्नरों ने मुस्लिम युवक रफीकुल को पकड़ करके पहले मुंडन किया,उसके बाद में पेशाब पिलाया।
थाना सहावर पुलिस ने तीन किन्नर समेत पांच लोगों को गिरफ्तार करके जेल भेज दिया है। @Uppolice#Kasganj#UttarPradesh pic.twitter.com/dzpls5N0Kv
— Shubham Srivastava (@ShubhamKlive) July 29, 2023