ఐదు నెలల పులి పిల్లను చంపిన పెద్దపులి
పులి పిల్ల | రాజస్థాన్‌లోని రణతంబోర్ నేషనల్ పార్కులో ఓ ఐదు నెలల పులి పిల్ల చనిపోయింది. గాంధ్రా దేహ హిల్లే అటవీ ప్రాంతంలో పులిపిల్ల ముక్కలుగా ఉన్న

జైపూర్: రాజస్థాన్‌లోని రణతంబోర్ నేషనల్ పార్కులో ఓ ఐదు నెలల పులి పిల్ల చనిపోయింది. గాంధ్రా దేహ హిల్లే అటవీ ప్రాంతంలో పులిపిల్ల ముక్కలుగా ఉన్న స్థితిలో అటవీ అధికారులు గుర్తించారు. ఓ పెద్ద పులి దానిని గాయపరచడంతోనే అది మరణించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఐదు నెలల ఆ పిల్ల మెడపై పంజా గుర్తులు ఉన్నాయని ఫీల్డ్ డైరెక్టర్ టీసీ వర్మ వెల్లడించారు. పోస్టుమార్టం అనంతరం దానిని పూడ్చిపెట్టామని తెలిపారు. ఆ పులిపిల్ల చివరిసారిగా మార్చి 26న తన తల్లితో (టీ-60) తిరుగుతూ కనిపించిందని వెల్లడించారు.
కాగా, ఒడిశాలోని నందన్‌కానన్ జులాజికల్ పార్కులో గత ఆదివారం ఓ తెల్ల పులి మూడు పిల్లలకు జన్మనిచ్చింది. ఆ పులి పేరు విజయ అని, దానికి ఇది మూడో ఈత అని అధికారులు చెప్పారు. ఆదివారం ఉదయం 10.58 గంటలకు తొలుత ఒక పిల్లను, మధ్యాహ్నం 1 గంటలకు, మళ్లీ 1.35 గంటలకు మరో రెండు కూనలకు జన్మనిచ్చింది. గతంలో 2016, ఆగస్టు 20న రెండు పిల్లలకు, 2017, సెప్టెంబర్ 17 మరో రెండు పిల్లలకు జన్మనిచ్చింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
బ్లడ్ క్యాన్సర్.. లక్షణాలు ఎలా ఉంటాయి.. చికిత్స ఏంటి..?
ఈ సమ్మర్లో షుగర్ పేషెంట్స్ ఇవి ట్రై చేయొచ్చు
దీదీ.. మరో నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారా?
మట్టివాసన ఉన్న సినిమా ఇది!
ఈ నెలలో అన్ని రోజులూ టీకా
మగ ఉద్యోగులకు 24 వారాల పేరెంటల్ లీవ్.. వోల్వో ఇండియా నిర్ణయం
మోనాలిసా, మార్లిన్ మన్రో, లిబర్టీ విగ్రహానికి.. మాస్క్!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

