భోపాల్: పశువులను మేపటంపై రెండు వర్గాల మధ్య మొదలైన వాగ్వాదం.. ఐదుగురు ప్రాణాల్ని బలిగొన్నది. మధ్యప్రదేశ్లోని డాటియా జిల్లా రెండా గ్రామంలో బుధవారం ఉదయం రెండు వర్గాలకు చెందిన సభ్యులు పరస్పరం కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు చనిపోగా, 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజికవర్గంలో ఈ ఘటన చోటుచేసుకుంది. జిల్లా ఎస్పీ ప్రదీప్శర్మ మీడియాకు వివరాలను తెలిపారు.