Clash | జమ్ముకశ్మీర్‌లోని పోలీస్‌స్టేషన్‌పై సైనికుల దాడి.. 40 మంది జవాన్లపై ఎఫ్ఐఆర్ నమోదు..!
Clash | దేశాన్ని రక్షించే సైనికుల (Soldiers) కు, స్థానిక లా అండ్ ఆర్డర్ (Law and Order) కాపాడే పోలీసులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir) లోని కిష్టవార్ జిల్లాలోగల అథోలి పోలీస్ స్టేషన్‌పై కర్రలు, రాడ్లతో ఆర్మీ సిబ్బంది దాడికి తెగబడ్డారనే ఆరోపణలపై ఒక కమాండింగ్ ఆఫీసర్, మేజర్ సహా ఏకంగా 40 మంది ఆర్మీ సిబ్బందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేయడం నేషనల్ లెవెల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Clash : దేశాన్ని రక్షించే సైనికుల (Soldiers) కు, స్థానిక లా అండ్ ఆర్డర్ (Law and Order) కాపాడే పోలీసులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir) లోని కిష్టవార్ జిల్లాలోగల అథోలి పోలీస్ స్టేషన్‌పై కర్రలు, రాడ్లతో ఆర్మీ సిబ్బంది దాడికి తెగబడ్డారనే ఆరోపణలపై ఒక కమాండింగ్ ఆఫీసర్, మేజర్ సహా ఏకంగా 40 మంది ఆర్మీ సిబ్బందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేయడం నేషనల్ లెవెల్లో హాట్ టాపిక్‌గా మారింది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. 17 రాష్ట్రీయ రైఫిల్స్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ ఎన్ అరుణ్ గాంధీ, మేజర్ వికాశ్ శర్మ, నయిబ్ సుబేదార్ శంకర్ గుర్కే సహా 40 మంది ఆర్మీ జవాన్లపై పోలీసులు కేసు ఫైల్ చేశారు. ప్రభుత్వ అధికారులపై దాడి చేయడం, పోలీస్ స్టేషన్ లోపలికి చొరబడి విధుల్లో ఉన్న సిబ్బందిని విచక్షణారహితంగా కొట్టడం వంటి తీవ్ర ఆరోపణలతో వీరిపై హత్యాయత్నం, పబ్లిక్ ప్రాపర్టీ ధ్వంసం చట్టాల కింద కఠినమైన లీగల్ సెక్షన్లు నమోదు చేశారు.
కిష్టవార్ అసిస్టెంట్ రీజినల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఒక ఆర్మీ వాహనాన్ని లీగల్ రూల్స్ ప్రకారం సీజ్ చేయడమే ఈ గొడవకు అసలు కారణం. దీనిపై లోకల్ పోలీసులకు, ఆర్మీ వారికి మధ్య వాగ్వాదం జరగ్గా ఆర్మీ సిబ్బంది ముందస్తు ప్లాన్‌తో లాఠీలు, ఐరన్ రాడ్లు, సార్టింగ్ సర్వీస్ వెపన్స్‌తో స్టేషన్‌కు వచ్చి దాడి చేశారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఈ అటాక్‌లో డీఎస్పీ విజయ్ కుమార్ భగత్, ఎస్‌హెచ్‌వో అమృత్ కాటోచ్ సహా పలువురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు.
మేజర్ వికాశ్ శర్మ అత్యంత దురుసుగా ప్రవర్తిస్తూ ఎస్డీపీఓపైనే భౌతిక దాడికి పాల్పడ్డారని డీఎస్పీ విజయ్ కుమార్ వెల్లడించారు. ఈ ఘటన జాతీయ స్థాయిలో చర్చనీయాంశం కావడంతో రక్షణ శాఖ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఈ ఘటనపై దర్యాప్తుకు ఆర్మీ పూర్తిస్థాయిలో సహకరిస్తుందని ప్రకటనలో రక్షణ శాఖ ప్రతినిధి స్పష్టంచేశారు. పోలీస్, మిలిటరీ సంయుక్త విచారణ అనంతరం తప్పు చేసిన వారిపై ఆర్మీ లీగల్ రూల్స్ ప్రకారం కఠినమైన చర్యలు ఉంటాయని ప్రకటించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aadarsha Kutumbam | ఓటీటీలోకి వెంకీ మామ ‘ఆదర్శ కుటుంబం’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్, నెట్‌ఫ్లిక్స్‌లో ఎప్పటి నుండి అంటే..!
Street Dogs | గద్వాలలో వీధి కుక్కల దాడి.. పలువురికి గాయాలు
Karthika Pournami | కార్తీక పౌర్ణమి వేళ శివాలయాలకు పోటెత్తిన భక్తులు..
Bala Krishna | బాలకృష్ణకు పాదాభివందనం చేసిన పరిటాల శ్రీరామ్.. నూతన జడ్పీ చైర్మన్‌కు ఎమ్మెల్యే కీలక సూచనలు!
Trisha | త్రిష రాజకీయ వారసురాలంటూ ప్రకటన.. జయలలితతో పోలికలు, తమిళనాట కొత్త సేవా సంస్థ!
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

