Hotel Fire | రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అజ్మీర్‌లోని ఓ హోటల్ (Ajmer Hotel)లో అగ్ని ప్రమాదం (Hotel Fire) సంభవించింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక నాజ్ హోటల్ (Hotel Naaz)లో గురువారం ఉదయం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో దట్టమైన పొగ వ్యాపించింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో భయాందోళనకు గురైన హోటల్లోని వాళ్లు.. ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీశారు. ఈ క్రమంలో ఓ మహిళ తన బిడ్డను కిటికీలోంచి బయటకు విసిరేసింది. మూడో అంతస్తు నుంచి కిందకు విసరగా.. అక్కడున్న వారు చిన్నారిని పట్టుకున్నారు. ఆమె కూడా అలానే దూకేందుకు ప్రయత్నించగా.. మంటల ధాటికి సాధ్యపడలేదు. మంటల్లోనే చిక్కుకుపోయినట్లు పోలీసులు తెలిపారు. చిన్నారికి మాత్రం స్వల్ప గాయాలైనట్లు చెప్పారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకొని మంటలను అదుపుచేశారు. హోటల్లో ఉన్న ఏసీ పేలడం వల్లే ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు. ఈ మేరకు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read..
Triple Talaq: వరకట్న వేధింపులు.. ఫోన్లో ట్రిపుల్ తలాక్.. మహిళ ఆత్మహత్య.. ఎస్సైపై వేటు
Pahalgam Attack | ఉద్రిక్తతలు తగ్గించుకోండి.. భారత్, పాక్‌కు అమెరికా సూచన