4 రోజులు పని.. 3 రోజులు లీవు.. రోజుకు 8 గంటలకు బదులుగా 12 గంటలు వర్క్
న్యూఢిల్లీ, జూన్ 11: కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో కార్మికుల పని గంటలు, సెలవుల విధానాన్ని ఏకతాటిపైకి తీసుకురావడానికి పార్లమెంటు కిందటేడాది నాలుగు కార్మిక చట్టాలకు (వేతనాల కోడ్, ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్, సోషల్ సెక్యూరిటీ కోడ్, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల చట్టం) ఆమోదం తెలిపింది. అయితే ‘కార్మికులు’ అనేది రాజ్యాంగంలో ఉమ్మడి జాబితాలోని అంశం. కాబట్టి కేంద్రం చట్టాలకు అనుగుణంగా రాష్ర్టాలు తమ నిబంధనల్లో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ కారణంగా చట్టాల అమలు ఆలస్యమవుతున్నది. ఇంకా కొన్ని రాష్ర్టాలు తమ పరిధిలోని ఉద్యోగుల పనిగంటలు, సెలవులు, వేతనాలపై కేంద్ర చట్టాలకు అనుగుణంగా నిబంధనలను నోటిఫై చేయాల్సి ఉన్నది. రాష్ర్టాలన్నీ కేంద్ర చట్టాలకు అనుగుణంగా రూల్స్ తయారు చేస్తే ఈ జూలై 1 నుంచి కొత్త చట్టాలు అమలు అవుతాయని అంచనా.
కేంద్ర స్థాయిలో ఉద్యోగుల పనిగంటలు, లీవులు ఫ్యాక్టరీల చట్టం-1948 ప్రకారం ఉంటాయి. రాష్ర్టాల పరిధిలో షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ప్రకారం ఉంటాయి. కొత్త లేబర్ కోడ్లు అమల్లోకి వచ్చినప్పటికీ రాష్ర్టాలు తమ పరిధిలో ఉద్యోగులు, కార్మికుల పనిగంటలను చట్టాలకు లోబడి ఎలాగైనా మార్చుకోవడానికి వెసులుబాటు ఉందని కేంద్రం చెప్తున్నది.
కొత్త చట్టాలు అమలైతే రానున్న మార్పులు..
1. పనిగంటలు: కొత్త కార్మిక చట్టాల్లో ప్రధానమైన అంశం ఇదే. ఏ సంస్థలోనైనా కార్మికులు నాలుగు రోజులు పనిచేసి మూడు రోజులు సెలవు తీసుకోవడానికి ఈ చట్టాలు అనుమతిస్తున్నాయి. అయితే, ఇప్పుడున్నట్టు రోజుకు 8 గంటలు కాకుండా 12 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. ఏకబిగిన మూడు రోజులు సెలవులు ఇవ్వడం వల్ల ఉద్యోగులు మానసికంగా ఉల్లాసంగా ఉండి ఉత్పాదతకత పెరుగుతుందని కొంత మంది వాదిస్తుండగా.. వరుసగా నాలుగు రోజుల పాటు రోజుకు 12 గంటల చొప్పున పనిచేస్తే కార్మికుల శారీరక ఆరోగ్యం దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
2. వేతనం: కొత్త లేబర్ చట్టాల ప్రకారం కార్మికుడి మూల వేతనం(బేసిక్) మొత్తం(గ్రాస్) జీతంలో సగం ఉండాలి. ప్రస్తుతం అన్ని కంపెనీల్లో బేసిక్ తక్కువగా, అలవెన్సులు ఎక్కువగా చూపించి పీఫ్లో తక్కువ జమ చేస్తున్నారు. బేసిక్, డీఏ ఆధారంగా పీఎఫ్ ఇన్స్టాల్మెంట్ను నిర్ణయిస్తారు. కొత్త చట్టాలు అమల్లోకి వస్తే కంపెనీ, ఉద్యోగి జమ చేయాల్సిన పీఎఫ్ వాటా పెరుగుతుంది. దీంతో టేక్ హోం శాలరీ తగ్గుతుంది. టేక్ హోం శాలరీ తగ్గితే, ప్రస్తుతం మండిపోతున్న ధరలతో సామాన్యులు ఎలా బతుకుతారని పలువురు ప్రశ్నిస్తున్నారు.
3. సెలవులు: ఏదైనా కంపెనీలో చేరిన ఉద్యోగి ఆర్జిత సెలవులు(ఈఎల్స్) పొందాలంటే ప్రస్తుతం 240 రోజులు ఆగాలి. కొత్త లేబర్ కోడ్స్ ప్రకారం దీన్ని 180 రోజులకు తగ్గించారు. ఉద్యోగి పనిచేసిన ప్రతీ 20రోజులకు ఒక ఈఎల్ లభిస్తుంది. దీంతో పాటు కార్మికుల ఓవర్ టైమ్ పరిమితిని కూడా పెంచారు. ప్రస్తుతం మూడు నెలల వ్యవధిలో కార్మికులు 50 గంటలు ఓటీ చేయవచ్చు. దీన్ని 125 గంటలకు పెంచారు. ఓటీల కారణంగా మానసిక, శారీరక సమస్యలు తలెత్తవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nitish Setu | నితీశ్ సేతుపై ఆర్జేడీ కార్యకర్తల వీరంగం.. బ్యానర్లు ధ్వంసం
The Lakshmana | వెండితెరపై లక్ష్మణుడి అజ్ఞాత వీరగాథ.. ఆకట్టుకుంటున్న ‘ది లక్ష్మణ’ ఫస్ట్ లుక్ పోస్టర్!
Mallu Ravi | ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి లక్ష్మణ రేఖ దాటారు : మల్లు రవి
YSRCP | టీడీపీ ఎమ్మెల్యే జయరాం వర్గీయుల దౌర్జన్యం.. వైఎస్సార్సీపీ నేత రామాంజనేయరెడ్డి కిడ్నాప్
Road Accident | లారీని ఢీకొట్టిన టెంపో.. ఒకే కుటుంబానికి చెందిన 9 మంది దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

