న్యూఢిల్లీ, జూలై 29: ప్రధాని మోదీ తన ప్రభుత్వానికి సంబంధించి ప్రచారం చేసుకునేందుకు భారీగా ఖర్చు చేశారు. గత ఐదేండ్లలో పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాల్లో ప్రకటనల కోసం రూ.3,339.49 కోట్లు ఖర్చు చేసినట్టు కేంద్ర సమాచారశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ రాజ్యసభలో వెల్లడించారు.
సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రకటనలకు ఈ మొత్తాన్ని వెచ్చించిందని తెలిపారు. విదేశాలకు చెందిన ఏ సంస్థకు కూడా ఏ శాఖ కానీ, విభాగం కానీ ప్రకటనల కోసం నిధులు చెల్లించలేదని స్పష్టం చేశారు.