న్యూఢిల్లీ, ఆగస్టు 31: ఢిల్లీలో ఓటర్ జాబితా సమగ్ర సర్వే (సర్) ఫలితంగా రాష్ట్రంలో 47.7 లక్షల మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగిస్తున్నట్టు ఈసీ ప్రకటించింది. సోమవారం ఢిల్లీ ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసింది. దీని ప్రకారం ప్రతి ముగ్గురు ఓటర్లలో ఒకరి పేరును జాబితా నుంచి తొలగించటం సంచలనంగామారింది.
‘సర్’ చేపట్టిన అన్నిరాష్ర్టాలూ, యూటీల్లో ముసాయిదా దశలోనే అత్యధిక శాతం ఓటర్ల తొలగింపు ఢిల్లీలో నమోదైందని, ఇక్కడ 33 శాతం మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించారని అధికారులు చెప్పారు.