చెన్నై, మే 27 : సరదాగా జాయ్‌రైడ్ ఎక్కిన జనాలు (రైడర్స్).. అది మధ్యలో ఆగిపోయే సరికి 3 గంటలపాటు గాలిలోనే గడపాల్సి వచ్చింది. ఇంజిన్ పనిచేయటం ఆగిపోవటంతో దాదాపు 50 అడుగుల ఎత్తులో జాయ్‌రైడ్ నిలిచిపోయింది. దీంట్లో చిక్కుకున్న 30 మంది రైడర్స్ కిందికి రాలేని పరిస్థితి ఏర్పడింది.
పిల్లలు, మహిళలు సహా అందరూ రాత్రి 9.30 గంటల దాకా అందులోనే చిక్కుకుపోవటంతో అందరూ టెన్షన్ పడ్డారు. సోమవారం సాయంత్రం చెన్నైలోని ఓ ప్రైవేట్ అమ్యూజ్మెంట్ పార్క్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. చివరికి కొన్ని గంటల తర్వాత ఫైర్, రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకొని క్రేన్ సహాయంతో ఒక్కొక్కరిని కిందికి తీసుకొచ్చారు.