జైపూర్ (రాజస్థాన్): “కలెక్టర్ మేడమ్ కుమార్తె అయితే ఇలాగే చేస్తారా? నా కూతురు ఆరు రోజులుగా గోతిలో అల్లాడిపోతోంది. ఇన్ని రోజులుగా ఇలాగే వదిలేస్తారా? దయచేసి వీలైనంత త్వరగా బయటకు తీయండి” – రాజస్థాన్‌లో ఆరు రోజులుగా బోరుబావిలో చిక్కుకున్న మూడేళ్ల చిన్నారి చేతన తల్లి ధోలీదేవి ఆవేదన ఇది.
కోట్‌పుత్లి-బెహ్రార్ జిల్లాకు చెందిన చేతన ఈ నెల 23న తండ్రి పొలంలోని 150 అడుగుల లోతైన బోరుబావిలో పడిపోయింది. 110 గంటలుగా చిన్నారిని రక్షించేందుకు సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అధికారులు పైపు ద్వారా ఆహారం, నీళ్లు అందిస్తున్నారు.